20-09-2025 02:38:41 PM
హుజూరాబాద్,(విజయక్రాంతి): హైదరాబాద్ లో జరుగుతున్న ఫోటో ఎక్స్ పో(Photo Expo) కార్యక్రమానికి కరీంనగర్ జిల్లాహుజురాబాద్, జమ్మికుంట మండలాల ఫోటో, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు శనివారం తరలివెళ్లారు. హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు బయలు దేరగా, హుజూరాబాద్ కాంగ్రెస్ పట్టణ, మండల అధ్యక్షులు మేకల తిరుపతి, కొలుగూరి కిరణ్, సీనియర్ నాయకులు సొల్లు బాబు, జమ్మికుంట పట్టణ అధ్యక్షులు సుంకరి రమేష్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఫోటోగ్రాఫర్లు ప్రతి జ్ఞాపకాన్ని కెమెరాల్లో బంధించి గుర్తుండిపోయే అనుభవాలను ప్రతి ఒక్కరికి పంచుతారని, ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే శుభకార్యంలో వీరి పాత్ర కీలకమని అన్నారు. అలాగే ప్రతి సంవత్సరం ఫోటో ఎక్స్పోలో నూతన కెమెరాలను లాంచ్ చేసి కొత్త కొత్త మెలకువలకు సంబంధించిన విషయాలను ఫోటోగ్రాఫర్లకు వివరిస్తారని, ఇక్కడి నుంచి ఈ కార్యక్రమానికి వెళ్లే ప్రతీ సభ్యుడు కొత్త కొత్త మేలకువలు నేర్చుకొని ఈ రంగంలో మరింత రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ హుజూరాబాద్ మండల అధ్యక్షుడు తలకొక్కుల హరిప్రసాద్, ప్రధాన కార్యదర్శి చిరంజీవి, కోశాధికారి మధుకర్, రాష్ట్ర సభ్యుడు మాచర్ల రాజు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.