20-09-2025 02:49:10 PM
జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ పోటీలు..
బెల్లంపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తాపీ భవనంలో స్కూల్ గేమ్స్ అసోసియేషన్(School Games Association) ఆధ్వర్యంలో శనివారం 69 లెవెల్ అండర్-14 ఇయర్ సెలక్షన్ కోసం పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను బెల్లంపల్లి మండల విద్యాధికారి పోచయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి శక్తివంతమైన యువత కావాలని, కరాటే, ఆటల పోటీల ద్వారా మాత్రమే యువశక్తి ఉద్భవిస్తుందన్నారు. విద్యార్థుల్లో మానసికో ల్లాసం, దేహదారు దారుఢ్యo ఆటలు క్రీడల తోటే సాధ్యపడతాయన్నారు. అందుకే ఆటలు జీవితానికి భవిష్యత్తుకు బాటలు వేస్తా అన్నారు. చదువుతో పాటు ఆటపాటలపై విద్యార్థుల్లోనూ రాణించాలన్నారు. క్రీడలు విద్యార్థులను క్రమశిక్షణగా తీర్చిదిద్దుతాయన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు చిలుముల శంకర్, కాంగ్రెస్ ఎస్సి సెల్ రాష్ట్ర కార్యదర్శి చిన్న రాజం, ఆకనపల్లి హై స్కూల్ హెచ్ఎం దామోదర్, మాజీ ఎంఈఓ మహేశ్వర్ రెడ్డి, జీహెచ్ఎస్ సెక్రటరీ యాకూబ్, కరాటే అసోసియేషన్ అధ్యక్షుడు మాస్టర్ వి రవి, బ్రాంచెస్ స్కూల్ హెడ్మాస్టర్ రఘు బాబు, పీడీలు చాంద్ పాషా, బండిరవి, క్రీడల నిర్వాకులు కరాటే మాస్టర్ ఎనగందుల వెంకటేష్, పీఈటీలు రాజు మహ్మద్, శివ మహేష్, పద్మ, విద్యార్థులు పాల్గొన్నారు.