20-09-2025 02:36:26 PM
అభివృద్ధి తమ లక్ష్యం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ అభివృద్ధియే తనకు ముఖ్యమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ నగరంలోని అప్పన్నపల్లి మూడవ వార్డులో రూ.10 లక్షలు జనరల్ ఫండ్ తో సీసీ రోడ్డు నిర్మాణపు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత 20 నెలలుగా ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి అన్ని కాలనీల్లో చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో అందరూ భాగస్వామ్ కావాలని పిలుపునిచ్చారు.
ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల అభీష్ట మేరకు అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. మంచి చేయడమే లక్ష్యంగా అభివృద్ధికి కంకణబద్ధులమై పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు ఖాజా పాషా, అంజద్, నాయకులు గుమాల్ శ్రీను, రామకృష్ణ, శివ, పురుషోత్తం, అర్షద్ అలి తదితరులు పాల్గొన్నారు.