calender_icon.png 20 September, 2025 | 4:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ స్టడీ సర్కిల్లో కోచింగ్ తరగతులు పున:ప్రారంభించాలి

20-09-2025 02:35:45 PM

భీమ్ ఆర్మీ జిల్లా అద్యక్షులు దొబ్బల ప్రవీణ్ కుమార్

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లాలోని ఉన్నటువంటి ఎస్సీ స్టడీ సర్కిల్(SC study circles) యందు కోచింగ్ తరగతులను పున:ప్రారంభించాలని భీమ్ ఆర్మీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా షెడ్యూలు శాఖ అభివృద్ధి అధికారికి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు దొబ్బల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జిల్లాలో  ఉన్నటువంటి నిరుద్యోగ యువతల దృష్టిలో ఉంచుకొని స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని అనేక పోరాటాలు చేశామని పోరాట ఫలితంగా స్టడీ సర్కిల్ ఏర్పడిందని అన్నారు.

స్టడీ సర్కిల్లో గత నోటిఫికేషన్ కొరకు తరగతులు ప్రారంభించిన మళ్లీ నిలిపివేయడం జరిగిందని అన్నారు కావున రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వలనుకుంటున్న సమయములో రానున్నటువంటి ప్రభుత్వ నోటిఫికేషన్ దృష్టిలో ఉంచుకొని ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేకమంది పేద బడుగు బలహీన వర్గాల నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచుకొని కోచింగ్ తరగతులను మళ్ళీ ప్రారంభించాలని కోరారు ఇప్పుడున్న పరిస్థితులలో గవర్నమెంట్ జాబ్ పొందాలంటే కోచింగ్ తప్పనిసరి అని అలాంటి కోచింగ్ ను  ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు లక్షల రూపాయలతో కోచింగ్ ఇస్తున్నారని అలాంటి పరిస్థితుల్లో జిల్లాలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల విద్యార్థులు లక్షల్లో ఉన్న ఫీజులు కట్టలేక ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయడమే మానేశారని అన్నారు కాబట్టి ఇలాంటి సమయంలో పేద  విద్యార్థులకు ఉపయోగపడే విధంగా వారు సైతం ప్రభుత్వ ఉద్యోగ సాధించే దిశగా ఎస్సీ సర్కిల్లో కోచింగ్ తరగతిలో ప్రారంభిస్తే వారికి ఉపయోగకరంగా ఉండి ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తారని అన్నారు. వెంటనే  అధికారులు స్టడీ సర్కిల్ కోచింగ్ తరగతులు ప్రారంభించాలని  కోరారు. ఈ కార్యక్రమం లో నాయకులు మధు,రంజిత్ ,సాయి, అజయ్ ,అరుణ్, ప్రసాద్ తదితరులు పాల్గోన్నారు..