20-09-2025 02:42:51 PM
మొదటి ప్రయత్నంలోనే ఎంబీబీఎస్ సీటు సాధించిన రామావత్ లచ్చిరాం
ఖర్చులకు డబ్బు లేక కుమిలిపోతున్న తల్లిదండ్రులు
దాతల సాయం కోసం ఎదురుచూపు
నాగార్జునసాగర్ (విజయక్రాంతి): డాక్టర్ కావాలనేదే అతని లక్ష్యం. చిన్నప్పటి నుంచి ఎవరు అడిగినా డాక్టర్ అవుతానంటూ చెప్పేవాడు. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉంటూ అన్నింట్లోనూ మంచి ఫలితాలు సాధించాడు. చివరగా తాను అనుకున్న లక్ష్యానికి చేరువయ్యాడు. కానీ నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థి ఆ ఘనత సాధించాడు. ప్రభుత్వ గురుకుల విద్యాలయాల్లోనే చదువుతూ పాఠశాల, కళాశాల విద్యను పూర్తి చేశాడు. ప్రస్తుతం తనకెంతో ఇష్టమైన వైద్య కళాశాలలో సీటు సాధించినా, వైద్య విద్య చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డొస్తున్నాయి. రోజూ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న అతని తల్లిదండ్రులు తమ కుమారుడి వైద్య విద్యకు సాయం అందించాలంటూ అర్థిస్తున్నారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో తిరుమలగిరి(సాగర్) మండలం ఎర్ర చెరువు తండా చెందిన రామావత్ జైరాం రెండో కుమారుడు రామావత్ లచ్చిరాం ప్రభుత్వం మెడికల్ సైన్స్ రామగుండంలో ఎంబీబీఎస్ సీటు సాధించారు. నీట్‌లో ఉత్తమ ర్యాంకుతో ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థిని చదువుకు ఆర్ధిక అవసరాలు ఆటంకాలుగా మారాయి. చిన్నతనం నుంచి ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదువుకున్న లచ్చిరాం ఇప్పుడు హాస్టల్ ఫీజు, మెస్ చార్జీలు వంటి ఖర్చులు తలకు మించిన భారంగా మారాయి. నిరుపేద కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు ట్యూషన్ ఫీజు వరకు చెల్లించగలిగినా మిగతా ఖర్చులకు ఆర్ధిక పరిస్థితి సహకరించక కుమిలిపోతూ.. దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. తిరుమలగిరి సాగర్ మండలం ఎర్ర చెరువు తండా గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన లచ్చిరాం మొదటి ప్రయత్నంలోనే నీట్‌లో మంచి ర్యాంక్ తెచ్చుకుని మెడిసిన్‌లో సీటు సాధించాడు. తల్లితండ్రులు ఇద్దరు వ్యవసాయం పనులు చేసుకుంటూ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
దాతలు స్పందిస్తే డాక్టర్ అవుతా - కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్' రామావత్ లచ్చిరాం
హాస్టల్, మెస్ ఫీజు, స్టడీ మెటీరియల్ వంటివి ఖర్చులకు ఆర్ధిక స్థోమత సహకరించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాతలు ముందుకువచ్చి తమ కొడుకు చదువుకు సాయం కోరుతున్నారు. దాతలు ఫోన్ నెంబర్ 9492686671 కు కాల్ ఆర్థిక సాయం చేయవచ్చు.