calender_icon.png 20 September, 2025 | 4:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుంతను తప్పించబోయి ట్రాక్టర్ బోల్తా..

20-09-2025 02:32:45 PM

డ్రైవర్ సేఫ్.. 

తాండూరు (విజయక్రాంతి): రోడ్డుపై పడిన గుంతలను తప్పించబోయి ట్రాలీతో సహా ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన వికారాబాద్ జిల్లా(Vikarabad District) పెద్దేముల్ మండలం తిమ్సాన్పల్లిలో శనివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్రాక్టర్ నాగులపల్లి వైపు నుండి పెద్దేముల్ వెళుతుండగా తిమ్సాన్పల్లి గ్రామ సమీపంలోకి రాగానే రోడ్డుపై ఉన్న గుంతలను తప్పించబోయి తలకిందులుగా బోల్తా పడింది. డ్రైవర్ అప్రమత్తమై ట్రాక్టర్ పై నుండి దూకడంతో ఎలాంటి గాయాలు కాలేవు.