calender_icon.png 20 September, 2025 | 4:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్రిశక్తి క్షేత్రంలో దేవి శరన్నవరాత్రోత్సవాలు

20-09-2025 02:29:54 PM

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలో ముచుకుందా నది(మూసీ) ప్రక్కన శాసనాల శాస్త్రి, ప్రముఖ చారిత్రక పరిశోధకుడు కీర్తిశేషులు బి.ఎన్ శాస్త్రి నిర్మించిన దేశంలోనే అత్యంత అరుదైన ఒకే పీఠంపై ముగ్గురమ్మలు గల శ్రీ హరి హర త్రిశక్తి క్షేత్రంలో ఈనెల 22 నుండి వచ్చిన 2 వరకు నవరాత్రి మహోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఈ నెల 22న బాలా త్రిపుర సుందరి దేవిగా, 23న గాయత్రీ దేవిగా, 24న అన్నపూర్ణాదేవిగా, 25న మీనాక్షి దేవిగా, 26న మహాలక్ష్మి దేవిగా, 27న లలితా దేవిగా 28న రాజరాజేశ్వరి దేవిగా, 29న సరస్వతి దేవిగా, 30న దుర్గాదేవిగా, 1న మహిషాసుర మర్దినిగా, 2న కళ్యాణ కామేశ్వరి అలంకరణలో ముగ్గురమ్మలు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. నవరాత్రి మహోత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలను కల్పించినట్లు, శ్రీ సాయి కృష్ణ ఎల్డర్ కేర్ హోమ్స్ సేవా సంస్థ వారు ఆలయంలో నడిచేందుకు వీలుగా పూర్తిస్థాయిలో బండలు వేయించడం జరిగిందని వేద సంస్కృతి పరిషత్ సభ్యులు తెలియజేశారు.