20-09-2025 02:31:07 PM
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మారేపల్లి సురేందర్ రెడ్డి(Senior Congress party leader Surender Reddy) అన్నారు. మాహబూబ్ నగర్ కార్పొరేషన్ లోని దుర్గామాత ఆగమనం యూత్ ఆఫ్ యూనిటీ సంఘం ఆధ్వర్యంలో తిమ్మసాని పల్లిలో శ్రీ దుర్గామాత అమ్మవారి అంగమన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారేపల్లి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికీ పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెస్సార్ మాట్లాడుతూ శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులు ప్రజల అందరి పై ఉండాలి అన్ని కోరారు. అమ్మవారి అనుగ్రహముతో అందరూ అన్నివేళలా సుఖసంతోషాలతో ఆయుఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వర్ధ రవి, వెంకటస్వామి, వంశీ,యాదయ్య, నితిన్, బన్ని, కట్టమరాజు, దుర్గామాత ఆగమనం యూత్ ఆఫ్ యూనిటీ సంఘం సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ యువకులు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.