15-10-2025 01:43:47 AM
-ఉద్యోగం నుంచి తొలగిస్తూ పీసీబీ ఉత్తర్వులు
హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్‌ను తొలగిస్తూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) ఉత్తర్వులు జారీ చేసింది. కాలుష్య ని యంత్రణ బోర్డులో సుమంత్ ఒ ప్పంద ఉద్యోగిగా ఉన్నాడు. పరిపాలన కారణాలతో ఆయనను తొలగి స్తున్నట్లు పీసీబీ వెల్లడించింది. ఇది లా ఉంటే అటవీ శాఖలో డిప్యూటేషన్లు, బదిలీలంతా సుమంత్ చెప్పిన ట్లే జరిగేవంటూ ఆయనపై ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఆయను ప్రభుత్వం తొలగించినట్లు తెలుస్తోంది.