12-08-2025 12:00:00 AM
అశ్వాపురం, ఆగస్టు 11,(విజయ క్రాంతి): అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రా మానికి చెందిన జెడ్పీఎస్‌ఎస్ ఉన్నత పాఠశాల 2003-04 బ్యాచ్ పూర్వ విద్యార్థులు నిజమైన స్నేహం ఏంటో చాటి చెప్పారు. ఇటీవల చిన్ననాటి తోటి మిత్రుడు సాంబ య్య మృతి చెందగా, అతని కుటుంబం ఆర్థి క ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న మిత్రబృందం ఒక్కటై సహాయం అందించింది. ఆ కాలం గురువులు కృష్ణయ్య, శాంతకుమారి, జ్యోతి కూడా తమ వంతు సహకారం అం దించారు.
మొత్తం రూ.30 వేల రూపాయ లు సేకరించి, స్నేహితుడి కుమార్తె పేరుమీద ఫికస్డ్ డిపాజిట్ చేశారు. డిపాజిట్ బాండ్తో పాటు దశదినకర్మలకు కావలసిన బియ్యాన్ని సోమవారం కుటుంబానికి అందజేశారు.ఈ సందర్భంగా మిత్రబృందం కుటుంబాన్ని పరామర్శించి, మనోధైర్యాన్ని కల్పించింది. సంతోషంలో మాత్రమే కాదు, కష్టసమయం లో కూడా తోడు నిలిచే వాడే నిజమైన స్నే హితుడు అని ఈ ఉదారతతో అందరికీ చూ పించారు. ఈ కార్యక్రమంలో మిత్రులు రెడ్డి మహేష్, ఆవుల నరేష్, ఉపేందర్, చెంచుల రాము, వెంకటేశ్వర్లు, తోకల అశోక్ మరియు కుటుంబ సభ్యులుపాల్గొన్నారు.