12-08-2025 12:00:00 AM
నిర్మల్, ఆగస్టు 11 (విజయక్రాంతి): ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారు లు లక్షం మేరకు పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి దరఖాస్తుల అనంతరం వనమోహత్సవ్ నిర్వహ ణపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి దరఖాస్తును పరిశీలించి తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు.
మండ లాల వారీగా పెండింగ్ లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమం అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ, వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు.
అన్ని శాఖల ఆధ్వర్యంలో నాటిన మొక్కలకు సంబంధించిన వివరాలను వెంట వెంటనే అప్డేట్ చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఎప్పటికప్పుడు వేగవంతంగా పూర్తి చేస్తూ ఉండాలన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల్లో అధికారులంతా భాగ స్వామ్యం చేయాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అమలులోకి వచ్చిన ఉపాధ్యాయుల ఫేసియల్ రికగ్నైజింగ్ హాజరు పకడ్బందీగా అమలు చేయాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు పాఠశాలలకు తనిఖీలకు వెళ్లినప్పుడు ఈ అంశాన్ని ప్రత్యేకంగా పరిశీలించా లన్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.