calender_icon.png 9 May, 2025 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ధాన్యం గింజను కొంటాం

07-05-2025 12:00:00 AM

నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్లగొండ, మే 6 (విజయక్రాంతి) : రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొంటామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. రబీ ధాన్యం కొనుగోళ్లలో భాగంగా ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. నిజామాబాద్ తర్వాత అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేసిన జిల్లాలలో నల్లగొండ రెండవదని తెలిపారు.

వర్షం వచ్చినప్పటికి రైతులు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, వారం రోజుల్లో జిల్లాలో ధాన్యం కొనుగోలును పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మంగళవారం జిల్లా కలెక్టర్ నల్లగొండ జిల్లా, గుర్రంపోడు మండలం కొప్పోలు, గుర్రంపోడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఇక్కడ లారీల సమస్య ఉత్పన్నమైందని తెలుసుకొని తక్షణమే ఈ రెండు కేంద్రాలకు వెళ్లి సమస్యపె అక్కడి రైతులు, స్థానికులతో మాట్లాడారు. లారీల సమస్య లేకుండా ఎప్పటికప్పుడు పంపించే ఏర్పాటు చేస్తామని అన్నారు. ఒకే మిల్లుకు నాలుగైదు లారీలు పంపించకుండా ఆ పరిధిలో ఉన్న అన్ని మిల్లులకు ఒక్కో లారీ పంపించాలని, అప్పుడే ధాన్యాన్ని వెంటవెంటనే దించుకోవడం కొనుగోలు కేంద్రాలనుంచి పంపించడం సులభం అవుతుందని, లేదంటే ఒకే మిల్లుకు పంపించిన ట్లయితే దిగుమతి చేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు.

ఒకవేళ కేటాయించిన లారీలు సరిపోకపోతే అదనంగా స్థానికంగా లారీలను ఏర్పాటు చేయాలని తహసీల్దార్ శ్రీనివాసుకు కలెక్టర్ ఆదేశించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్, రెవెన్యూ అదనపు ఇన్చార్జి కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ హరీష్, జిల్లా సహకార అధికారి పత్యా నాయక్, గుర్రంపొడ్  తహసిల్దార్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. కాగా, కొప్పోలు, గుర్రంపోడు  ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా నిర్వహిస్తుండగా, ఈ రెండు కేంద్రాలలో రికార్డుల నిర్వహణ ,తేమ అన్ని సక్రమంగా ఉండడం పట్ల జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.