07-05-2025 12:00:00 AM
భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ర్ట అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉస్తేల సృజన, నేదునూరి జ్యోతి
దేవరకొండ, మే 6: కేంద్ర ప్రభుత్వం మహిళల శక్తి గురించి మాట్లాడుతుంది కానీ మహిళా శక్తిని నిర్వీర్యం చేసే సనాతన ధర్మాలను పాటించాలని నిరంకుశంగా వ్యవహరిస్తుందని దీనికి వ్యతిరేకంగా మహిళా లోకం ఉద్యమించాలని భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ర్ట అధ్యక్షురాలు సృజన పిలుపునిచ్చింది. మంగళవారం రోజున దేవరకొండపట్టణంలోని పల్లా పర్వత్ రెడ్డి భవన్లో జరిగిన భారత జాతీయ మహిళా సమాఖ్య దేవరకొండ నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా రాష్ర్ట అధ్యక్షురాలు ఉస్తేల సృజన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహిళా శక్తి గురించి ఆహార నియంత్రణ గురించి మాట్లాడుతూనే వ్యవస్థీకృత హింసకు పాల్పడడం జరుగుతుందనీ,గ్రామీణ,పట్టణ ప్రాంతాలలో మహిళల వేతనాలు వ్యత్యాసలతో ఉన్నాయనీ,మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెంచాలని వారు అన్నారు.ఈ సమావేశంలో సిపిఐ రాష్ర్ట కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి,ప్రజానాట్యమండలి రాష్ర్ట ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహా, గిరి రమ,లింగంపల్లి అనిత, బొల్లె మంజుల,పల్లె జ్యోతి, సోమిడి అలివేలు,గ్యార సంగీత తదితరులు ఉన్నారు.