01-08-2025 12:00:00 AM
కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగ తిస్తున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. చట్టాలపై, కోర్టులపై కాం గ్రెస్‌కు గౌరవం ఉందని గురువారం హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వ్యా ఖ్యానించారు.
మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆనాడు బీఆర్‌ఎస్‌కు 88 మంది ఎమ్మెల్యేల మెజారిటీ ఉన్నా, సిగ్గు లేకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులకు పాల్పడిందన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చిన నీచ చరిత్ర బీఆర్‌ఎస్‌దని మండిపడ్డారు.