calender_icon.png 2 July, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే సంబరాలు

01-07-2025 11:00:20 PM

భద్రాచలం (విజయక్రాంతి): లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం(Lions Club of Bhadrachalam) ఆధ్వర్యంలో పట్టణంలోని జీయర్ మఠం నందు లైన్స్ క్లబ్ అధ్యక్షురాలు పి కమల రాజశేఖర్ అధ్యక్షతనలో జరిగిన  డాక్టర్స్ డే(National Doctors Day) సెలబ్రేషన్ మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ వెంకటరావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ... వైద్య వృత్తికి సమాజంలో ఎంతో గౌరవం ఉందని పేర్కొంటూ పేద ప్రజలకు సేవ చేయటంలో వైద్యులు ముందుండాలని కోరారు. లయన్స్ క్లబ్ మంచి కార్యక్రమాలు చేపడుతున్నందున భవిష్యత్తులో పూర్తిస్థాయి సహాయ కార్యక్రమాలు అందిస్తానని హామీ ఇచ్చారు.

 అనంతరం భద్రాచలం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ ఎస్ ఎల్ కాంతారావు, డాక్టర్ ఆది మోహన్ రావు, డాక్టర్ రాజశేఖర్ తో పాటు ప్రముఖ డాక్టర్లను ఘనంగా సన్మానం  నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెక్రటరీ  లయన్ సిద్ధారెడ్డి, ట్రెజరర్ రామారావు, లయన్ డాక్టర్ ఏ.మోహన్ రావు, డాక్టర్ ఎస్ ఎల్ కాంతారావు, డాక్టర్ రాజశేఖర్, హరిచంద్ర నాయక్, పరిమి సోమశేఖర్, రామలింగేశ్వర రావు, బోనాల ఉమా శంకర్ నాయుడు, యోగి సూర్యనారాయణ, గాదె మాధవరెడ్డి, గట్టు వెంకటాచారి, జిందా, నవాబ్, మురళి, తదితరులు పాల్గొన్నారు.