01-07-2025 10:51:53 PM
బూర్గంపాడు (విజయక్రాంతి): ఈనెల 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు మండల కన్వీనర్ పాండవుల రామనాథం కోరారు. మంగళవారం ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మోరంపల్లి బంజర పీహెచ్సీ వైద్యాధికారిణి లక్ష్మీసాహితీకి సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా పాండవుల రామనాథం మాట్లాడుతూ... కేంద్ర బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లను తెచ్చి వాటి అమలుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని అన్నారు.
లేబర్ కోడ్ లను అమలు జరిగితే కార్మిక వర్గాలకు సంఘాలకు, ఆశ వర్కర్లకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆశాలకు కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, 20 రోజులు క్యాజువల్ మెడికల్ సెలవులు సీనియార్టీని బట్టి ఆశాలను ఏఎన్ఎంలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎం బుచ్చమ్మ, బి సుగుణ, శ్రీలత, పి ప్రమీల, వి నాగేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.