01-07-2025 11:13:11 PM
సీఐ చంద్రశేఖర్ రెడ్డి..
సిర్గాపూర్: సంగారెడ్డి జిల్లా(Sangareddy District) సిర్గాపూర్ మండల పరిధిలోని ఖాజాపూర్ గ్రామంలో ఆదివారం జరిగిన హత్య కేసులో నేరస్తులైన ఎనిమిది మందిని సీఐ చంద్రశేఖర్ రెడ్డి(CI Chandrashekar Reddy) అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్ చెయ్యడం జరిగింది. సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... కుర్మా సాయి గొండ ఫ్యామిలీకి, కూర్మ రమేష్ ఫ్యామిలీకి గతంలో భూ తగాదాలున్నాయని, రమేష్ హత్యకు గురైనా జైపాల్ ఇద్దరూ మిత్రులు సాయి గొండ ఫ్యామిలీకి, జైపాల్ కి పడదు, జైపాల్ తమ ప్రతి విషయంలో మద్యలో వస్తున్నాడనే ఉద్దేశ్యంతో ఆదివారం మధ్యాహ్నం రమేష్, జైపాల్ ఇద్దరూ ఆవులకు నీళ్లు తాగిపించనికి పొలంకి వెల్దామని సాయి గొండ షెడ్డు వద్దకు పోయేసరికి అంతలో సాయి గొండ మరియు అతని కొడుకులు హన్మంతు, రాజు, పండరి, అతని, భార్య కిష్టవ్వ, కోడళ్ళు కవిత, వసుధ, డాక్ గొండ మొత్తం ఎనిమిది మంది కలిసి కట్టెలు, గోడ్డళ్లతో జైపాల్ పై దాడి చెయ్యగా అక్కడికక్కడే చనిపోయాడు. రమేష్ నీ కొడుతుండగా అంతలో అక్కడికి అతని అమ్మ మణెమ్మ, గ్రామస్తుడు చూసి అరిచేసరికి రమేష్ నీ వదిలి పెట్టీ పారిపోయారు. పోలీసులు మంగళవారం వారిని అదుపులో తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగిందని సీఐ చంద్రశేఖర్ రెడ్డి, హెచ్.ఓ వెంకట్ రెడ్డి తెలిపారు.