01-07-2025 10:56:48 PM
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షురాలు యెలమొని స్వప్న..
ఇబ్రహీంపట్నం: ఈ నెల 9న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షురాలు యెలమొని స్వప్న(CITU State President Yelamoni Swapna) అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం మధ్యాహ్న భోజన కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని ఎంఈఓ హిర్యానాయక్(MEO Hirya Nayak)కు సమ్మె నోటీసును ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన రాష్ట్ర అధ్యక్షురాలు యెలమొని స్వప్న మాట్లాడుతూ.. జూలై 9న స్కూల్లో వంట బందు పెట్టి ఆ రోజు జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మున్సిపల్ కన్వీనర్ చింతపట్ల ఎల్లేశా, మండల కన్వీనర్ సిహెచ్ బుగ్గరాములు, అంగన్వాడి యూనియన్ జిల్లా నాయకురాలు జి బాలామణి, భవన నిర్మాణ రంగం నాయకులు వి సంతోష్ కుమార్, మధ్యాహ్న భోజన కార్మికులు సుఖమ ప్రేమలత రాధ తదితరులు పాల్గొన్నారు.