calender_icon.png 16 October, 2025 | 9:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలి

16-10-2025 06:33:23 PM

ములకలపల్లి (విజయక్రాంతి): డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ములకలపల్లి ఎస్సై మధు ప్రసాద్ కోరారు. గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 'చైతన్యం' డ్రగ్స్ పై యుద్ధం అనే కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థినీ విద్యార్థులతో మాట్లాడారు. డ్రగ్స్ వాడకం వల్ల ఆర్థికంగా శారీరకంగా మానసికంగా నష్టపోతారని వీటికి దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. డ్రగ్స్, గంజాయి లాంటి మాదకద్రవ్యాలకు అలవాటు పడిన, సరఫరా చేసిన కేసులపాలై జైలు జీవితాలను గడపడంతో పాటు భవిష్యత్తు అందాకారంగా మారుతుందన్నారు. విలువైన జీవితాలు నాశనం అయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. విద్యార్థినీ విద్యార్థుల చేత డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఎస్.కె.అతేహార్ అలీ, అధ్యాపక సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.