calender_icon.png 18 December, 2025 | 11:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలి

18-12-2025 01:52:26 AM

మున్సిపల్ మాజీ చైర్మన్ కుడుముల సత్యనారాయణ

ఎల్లారెడ్డి, డిసెంబర్ 17 (విజయ క్రాంతి): ఎల్లారెడ్డి మండలంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని మున్సిపల్ మాజీ చైర్మన్ కుడుముల సత్యనారాయణ  సూచించారు. బుధవారం ఎల్లారెడ్డి మండలంలోని రేపల్లెవాడ సర్పంచ్ దుద్దుల వనిత సాయిరాం, సబ్దల్ పూర్ గ్రామ సర్పంచ్ బయ్యని స్వప్న సాయిలు, మల్లయ్య పల్లి గ్రామ సర్పంచ్ ఎరువుల లక్ష్మీ మైసయ్య, మౌలాన్ ఖేడ్ సర్పంచ్ పుట్ల చంద్రశేఖర్, అల్మాజీపూర్ సర్పంచ్ దత్తు, బ్రాహ్మణపల్లి సర్పంచ్ అంజయ్య, లక్ష్మాపూర్ నాయక్ సాయిలు, హాజీపూర్ సర్పంచ్ రతన్ నాయక్,

అడవిలింగాల్ సర్పంచ్ మంగలి సంతోష్ లతో పాటు మండలంలోని ఉపసర్పంచ్లు వెంకటేశం, సత్యనారాయణ, చింతల రాజు, అంజయ్య, మహిపాల్, యాదయ్య, బీరప్పలను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో నూతన సర్పంచులుగా ఎన్నికైన వారందరూ కలిసి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నూతన సర్పంచులుగా తమ గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు ప్రణాళికలతో ముందుకు సాగాలన్నారు. ఉత్తమ గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దాలని సూచించారు.