18-12-2025 01:54:04 AM
నాగిరెడ్డిపేట్, డిసెంబర్ 17 (విజయ క్రాంతి): మండలంలోని మెల్లకుంట తండా గ్రామ పంచాయతీకి ఎన్నికైన నూతన సర్పంచ్ బాల్యనాయక్ను,మాజీ జడ్పీటీసీల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.... గ్రామ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సర్పంచ్ పదవి బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. సమిష్టి కృషితో మెల్లకుంట తండా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు. ఈ సన్మాన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులతో పాటు గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు