24-12-2025 12:29:23 AM
డిఎఓ సురేఖ
మందమర్రి(మంచిర్యాల), డిసెంబర్ 23 (విజయక్రాంతి) : జిల్లా రైతాంగం ఆధునిక వ్యవసాయ సాగు వైపు దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎల్తూరి సురేఖ కోరారు. మంగళవారం మందమర్రి మండలం సండ్రోన్ పల్లి రైతు వేదికలో భారత మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన జాతీయ కిసాన్ దివస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులకు వివిధ వ్యవసాయ పథకాలపై అవగాహన కల్పించారు. ఎంజిఎన్‌ఆర్ ఈ జీ ఎస్ పథకం పీక్ సీజన్లో వ్యవసాయానికి ఎలా ఉపయోగపడతాయో అవగాహన కల్పించారు.
రబీ సీజన్కు సంబంధించి పంటల సాగుపై సాంకేతిక సూచనలు, సమతుల్య ఎరువుల వినియోగం, మట్టి పరీక్షల ప్రాధాన్యత గురించి రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం వ్యవసాయంలో నూతన పద్ధతులను అవలంబిస్తూ మంచి ఫలితాలు సాధిం చిన రైతులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ ఎన్. మహేష్, పి. సాధ్వి, వ్యవసాయ విస్తరణాధికారి ముత్యం తిరుపతి, గ్రామ సర్పంచ్ మధు పొన్నాల, రైతులు తదితరులు పాల్గొన్నారు.