24-12-2025 12:28:19 AM
చేగుంట, డిసెంబర్ 23 :కొడుకు ప్రేమ వ్యవహారంపై తీవ్ర మనస్థాపానికి గురైన తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ముప్పిడి స్వామి (43) తన కొడుకు ప్రేమ విషయం తెలుసుకొని మనస్థాపం చెంది మంగళవారం తన వ్యవసాయ పొలం వద్ద ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య ముప్పిడి లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చేగుంట ఎస్త్స్ర చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు.