calender_icon.png 10 January, 2026 | 8:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియా పాత్ర కీలకం

09-01-2026 12:41:10 AM

రాజన్న సిరిసిల్ల, జనవరి 8 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం జిల్లా ఎస్పీ మహేష్ బి గితే చేతులమీదుగా విజయక్రాంతి జాతీయ దినపత్రిక నూతన సంవత్సరం 2026 క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి గితే మాట్లాడుతూ, సమాజంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. ప్రజలకు నిజమైన, నిష్పక్షపాత సమాచారం అందించడం ద్వారా అవగాహన పెంచడమే కాకుండా, సమాజ అభివృద్ధికి దోహదపడుతోంది.

విజయక్రాంతి జాతీయ దినపత్రిక ప్రజా సమస్యలను ప్రాధాన్యంగా తీసుకొని బాధ్యతాయుతమైన జర్నలిజంతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను. నూతన సంవత్సరంలో పత్రిక మరింత విజయవంతమై ప్రజల విశ్వాసాన్ని పొందాలని కోరుకుంటున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో విజయక్రాంతి దినపత్రిక రాజన్న జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రాజేంద్రప్రసాద్, వేములవాడ ఆర్ సి వేణు, కోనరావుపేట రిపోర్టర్ సంజీవ్, తంగళ్ళపల్లి రిపోర్టర్ దినేష్‌లు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.