calender_icon.png 23 January, 2026 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి

23-01-2026 01:19:43 AM

  1. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
  2. బొగ్గు టెండర్లపై సీబీఐ విచారణ కోరితే కేంద్రం సిద్ధం
  3. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు 

హైదరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి):మున్సిపల్ , కార్పొరేషన్ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని బీజేపీ రా ష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో వివరించాలని సూచిం చారు. బీజపీ రాష్ట్ర కార్యాలయంలో గురువా రం పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావు అధ్యక్షతన పార్టీ పదాధికారుల సమావేశం జరిగింది.

మున్సిపల్ ఎన్నికలతో పాటు పార్టీ అనుబంధ విభాగాల పనితీరు, రాష్ట్ర కమిటీ సభ్యులకు సంబంధించి నాలుగు నెలల పని బాధ్యతల ఫలితాలను సమీక్షించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికలను పార్టీ శ్రేణు లు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు.   

బీజేపీ అగ్రనేతలతో రెండు ఉమ్మడి జిల్లాల కు ఒకటి చొప్పున ఐదు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించా రు. సింగరేణి, నైనీ కోల్ టెండర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరితే అందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే సీబీఐ విచారణ వద్దని అసెంబ్లీలో తీర్మానం చేసిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.