calender_icon.png 23 January, 2026 | 2:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్ ప్రారంభం

23-01-2026 01:17:33 AM

ఎల్బీస్టేడియంలో జ్యోతిప్రజ్వలన చేసిన గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ

ముఖ్యఅతిథులుగా పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్ హాజరు 

35 వేల మంది క్రీడాకారులు..

15 రోజుల పాటు 30 మైదానాల్లో పోటీలు

భారత్‌లో ఒలింపిక్స్ నిర్వహించడమే మోదీ లక్ష్యం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, సిటీ బ్యూరో జనవరి 22 (విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా క్రీడా సం స్కృతిని పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్ 2025 అట్టహాసంగా ప్రారంభమైంది. బుధవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఏబీవీ అటల్ బిహారీ వాజ్‌పేయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకల ప్రారంభోత్సవం కనులపండువగా సాగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ విశిష్ట అతిథిగా హాజరై క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. ఈ వేడుకలో బ్యాడ్మింటన్ దిగ్గజాలు పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్, మహిళా క్రికెటర్లు డయానా డేవిడ్, దృష్టి కేసరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పాల్గొని క్రీడాకారుల్లో ఉత్సాహా న్ని నిం పారు. కార్యక్రమ నిర్వాహకులు, కేంద్రమం త్రి జి.కిషన్‌రెడ్డి ప్రసంగిస్తూ.. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో క్రీడా స్ఫూర్తిని రగిలించేందుకు ఈ మహోత్సవాన్ని నిర్వ హిస్తున్నట్లు తెలిపారు.

సుమారు 15 రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఇప్పటికే 35 వేల మంది క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకున్నారని వెల్లడించారు. నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్‌మెంట్లు, డివిజన్ల వారీగా ఎంపిక చేసిన 30 మైదానాల్లో కబడ్డీ, వాలీబాల్, ఖో-ఖో, అథ్లెటిక్స్ వంటి పోటీలు జర గనున్నాయి. జూనియర్, డిగ్రీ, ఇంటర్ కాలేజీల విద్యార్థులతో పాటు బస్తీల్లోని మహి ళల కోసం ప్రత్యేకంగా మ్యూజికల్ చైర్స్ పోటీలు నిర్వహిస్తుండటం విశేషం. యువత జనాభాలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న భారత్.. క్రీడల్లోనూ అదే స్థాయికి చేరాలన్నదే ప్రధాని మోదీ ఆశయమని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. వారణాసి తరహాలోనే హైదరాబాద్‌లోనూ ఈ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు.

భవిష్యత్తులో భార త్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్‌తో పాటు ఒలింపిక్స్ కూడా నిర్వహించాలన్న దృఢ సం కల్పంతో ప్రధాని ఉన్నారని తెలిపారు. ఈసారి ఖేల్ మ హోత్సవ్‌లో అందరినీ భాగస్వామ్యం చేసే లా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మీడియా ప్రతినిధులకు, దివ్యాం గులకు కూడా ప్రత్యేక క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రద ర్శించి ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్ర మానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ అటల్ బిహారీ వాజ్‌పేయ్ ఫౌండేషన్ తరఫున ఆయన ధన్యవాదాలు తెలిపారు.