11 August, 2026 | 1:41 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

అమెరికా సామ్రాజ్యవాదానికి పాడె కట్టాలి

24-06-2025 07:04 PM

వనపర్తి టౌన్: తమ ఆయుధాల వ్యాపార విస్తరణ కోసం దేశాల మధ్య యుద్దాలను ప్రోత్సహిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్(US President Trump), అమెరికా సామ్రాజ్యవాదానికి పాడె కట్టాలని సిపిఐ నేతలు పిలుపునిచ్చారు. సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో ఇరాన్ పై అమెరికా దాడికి వ్యతిరేకంగా ఎర్రజెండాలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ రాములు(CPI District Secretary Vijaya Ramulu) పట్టణ కార్యదర్శి రమేష్, సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ,  తదితరులు మాట్లాడారు. ప్రపంచంలో యుద్దాలను ప్రోత్సహించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మానవ వినాశనం చేస్తున్నారని విమర్శించారు.

తమ దేశం అమెరికాతో అణు ఒప్పందం చేసుకోలేదన్న కారణంతో ఇరాన్ ఆయుధాలు తయారు చేస్తున్నన్ని అంతర్జాతీయ అను శక్తి సంస్థ అమెరికా ఇంటలిజెన్సీ కూడా ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించిన ఇరాన్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాంబుల వర్షం కురిపించారని, ఇది అమానుషమన్నారు. ఉక్రెయిన్, ఇరాన్, ఇజ్రాయిల్, పాలస్తీనా, పాకిస్తాన్ తదితర దేశాల మధ్య యుద్దాలను ప్రోత్సహిస్తున్నారు. యుద్ధం వద్దు-ప్రపంచశాంతి ముద్దు అన్నారు.

శాంతితోనే ప్రపంచ ప్రజలు సంతోషంగా ఉంటారని, ప్రపంచంలోని దేశాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి అన్నారు. యుద్ధాలతో మానవ మనుగడకే ప్రమాదం అన్నారు. ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకొని యుద్దాలను నివారించాలన్నారు. ఎన్ఎఫ్ఐ డబ్ల్యు ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు కళావతమ్మ,సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు రాబర్ట్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మోష, జన జ్వాల, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కుతుబ్, పృధ్వి నాదం, లక్ష్మీనారాయణ, జయమ్మ, జ్యోతి, గంధం నాగరాజు, పాషా, విష్ణు తదితరులు పాల్గొన్నారు.