03-01-2026 12:00:00 AM
చౌటుప్పల్, జనవరి 2 (విజయక్రాంతి): చౌటుప్పల్ లక్కారం క్యాంప్ కార్యాలయంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ అధ్యక్షులు సుర్వి నర్సింహగౌడ్ ఆధ్వర్యంలో త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేస్తూ చౌటుప్పల్ పురపాలిక పరిధిలోని 20 వార్డుల్లో పార్టీ అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకోవాలని చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్యా పిలుపునిచ్చారు.
చౌటుప్పల్ మున్సిపాలిటీ లక్కారం క్యాంప్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మాట్లాడుతూ బిఆర్‌ఎస్ పార్టీ, బిజెపి పార్టీ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, మునుగోడు ఎన్నికల సమన్వయకర్త పబ్బు రాజు గౌడ్, మాజీ ఎంపీపీ తాడూరు వెంకటరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు,
జిల్లా ఫిషరీస్ చైర్మన్ పాశం సంజయ్ బాబు,చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, మండల అధ్యక్షులు బోయ దేవేందర్, తిరుపతి రవీందర్, బొంగు జంగయ్య గౌడ్, మొగుదల రమేష్ గౌడ్, బత్తుల విప్లవ్ కుమార్ గౌడ్, కాసర్ల శ్రీనివాసరెడ్డి కొయ్యల సైదులు, బాబా షరీఫ్, హను భాయ్, బొబ్బిళ్ళ మురళి, చేన్నగోని అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.