calender_icon.png 13 May, 2025 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు

13-05-2025 12:10:08 AM

ఎస్సీ కాలనీ నీటి సమస్యపై సత్వర పరిష్కారానికి చర్యలు

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

చిలప్చేడ్(మెదక్), మే 12(విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం చిలిపిచేడ్ మండలంలోని గౌతపూర్  గ్రామంలోని జిల్లా, మండల పరిషత్ పాఠశాలలో జరుగుతున్న రెవెన్యూ సదస్సును కలెక్టర్ తనిఖీ చేశారు. అనంతరం క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే తీరును పరిశీలించారు.

ఎస్సీ కాలనీ నీటి సమస్యపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ భారతి నూతన ఆర్‌ఓఆర్ రెవెన్యూ చట్టంపై పైలట్ ప్రాజెక్టు కింద చిల్పి చేడ్   మండలాన్ని ఎంపిక చేసి రైతుల నుండి సలహాలు, సూచనలు, భూ సంబంధత సమస్యల దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని 16 గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాల్సి ఉండగా ఇప్పటి వరకు 13 గ్రామాల్లో సదస్సులు పూర్తి అయినట్లు తెలిపారు.

ప్రజల  దరఖాస్తులను పరిశీలించిన కలెక్టర్, రైతులు భూ సంబంధిత సమస్యలపై ఇచ్చిన దరఖాస్తులను తప్పనిసరిగా రిజిస్టర్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ కాలనీలో నీటి సమస్యపై కలెక్టర్ స్పందిస్తూ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని పంచాయతీ సెక్రెటరీని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి, తహసిల్దార్ సహదేవ్, కొల్చారం తహసిల్దార్ శ్రీనివాసాచారి, డిప్యూటీ తహసిల్దార్ సింధుజ, సంబంధిత రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.