calender_icon.png 6 May, 2025 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండ్ల తోటల రైతులను ఆదుకోవాలి

06-05-2025 12:00:00 AM

మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు 

సిద్దిపేట, మే 5 (విజయక్రాంతి): అకాల వర్షాలకు నష్టపో యిన పండ్ల తోటల రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు సో మవారం సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూరు మండలం దర్గా గ్రామంలో పర్యటించిన ఆయన పండ్ల తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ నియోజకవర్గం లో 1800 ఎకరాలలో మామిడి పంట నష్టం జరిగిందని చెప్పారు.

వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖ అధికారులు పంటలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక త్వరగా అందించాలని కోరారు రైతులు ఇప్పటికే పంట నష్టపోయి ఆందోళనలో ఉన్నారని ఇన్పుట్ సబ్సిడీ వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. గత నెలలో వరుసగా ఐదుసార్లు అకాల వర్షం ఈదురు గాలులు వడగండ్ల వర్షం కురవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లందని వివరించారు ప్రభుత్వం వెంటనే  నష్టపరిహారం అందించాలని కోరారు.