04-07-2025 12:00:00 AM
-పాకిస్థాన్ ప్రధాని ప్రధాన సలహాదారు రానా
న్యూఢిల్లీ, జూలై 3: భారత్ ఆపరేషన్ సిందూర్ దాడులు చేసినపుడు ప్రతిస్పందించేందుకు పాకిస్థాన్ వద్ద కేవలం కేవలం 30 సెకండ్ల సమయం మాత్రమే ఉందని పాకిస్థాన్ ప్రధాని ప్రత్యేక సహాయకుడు రానా సనావుల్లా తెలిపారు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘భారత్ నూర్ ఖాన్ వైమానిక స్థావరం మీద బ్రహ్మోస్ క్షిపణులతో దాడి చేసినపుడు ఎలా ప్రతిస్పందించాలో ఆర్మీకి అర్థం కాలేదు. అది అణ్వస్త్ర క్షిపణి అని గుర్తించేందుకు పాక్ ఆర్మీకి కేవలం 30 సెకండ్ల సమయం మాత్రమే ఉంది.’ అని ఆయన పేర్కొన్నారు. కాల్పుల విరమణ ఒప్పందానికి కృషి చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.