calender_icon.png 23 August, 2025 | 9:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిందీ భాషాభివృద్ధికి సహకరించాలి

23-08-2025 01:21:26 AM

కేంద్ర మంత్రులను కలిసిన హిందీ ప్రచార సభ ప్రతినిధులు

ముషీరాబాద్, ఆగస్టు 22(విజయక్రాంతి): హిందీ ప్రచార సభ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ ఎస్.గైబువల్లి ఆధ్వర్యంలో  ప్రతినిధుల బృందం కేంద్ర హెూం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేం ద్ర ప్రధాన్, కేంద్ర హెూం శాఖ రాజ భాషా విభాగం సెక్రటరీ అన్సూలి ఆర్యలను పార్లమెంట్ భవనం, వారి వారి కార్యాలయాల్లో వేర్వేరుగా కలిసి దక్షిణ భారతదేశం లో హిం దీ భాషా అభివృద్ధికి సహకరించాలని విన్నవించారు.

ఈ సందర్భంగా మంత్రు లతో ఎస్. గైబువల్లి తెలియజేస్తూ దక్షిణ భారతదేశంలో హిందీ భాషా అభివృద్ధి జరగాలంటే పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు హిందీ భాషను నేర్చుకునే విధంగా పాఠశాలలు, కళాశాలలు, యూనివర్శిటీలలో హిందీ ఉపాధ్యాయులను, అధ్యాపకులను, ప్రొఫెసర్ల నియామకాలను చేపట్టాలని తెలిపారు. కేంద్ర మంత్రులు నిత్యానంద రాయ్, రామ్మోహన్ నాయుడు, ధర్మేంద్ర ప్రధాన్ హిందీ భాషేతర ప్రాంతాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక,  మహారాష్ట్రలలో హిందీ ప్రచార సభ హైదరాబాద్ ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భం గా హిందీ ప్రచార సభ హైదరాబాద్ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు ప్రభుత్వం ద్వారా అందిస్తామని కేంద్ర మం త్రులు, రాజ భాషా అధికారులు హిందీ ప్రచార సభ హైదరాబాద్ ప్రతినిధుల బృం దంకు తెలిపినట్లు వారు శుక్రవారం  వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హిందీ ప్రచార సభ హైదరాబాద్ న్యాయ సలహాదారులు జె. వెంకట రామ్ నరసింహారెడ్డి, రాజ బాషా విభాగం డిప్యూటీ డైరక్టర్ రఘువీర్ శర్మ, అసిస్టెంట్ డైరక్టర్ భావన సక్సేన, ఆంధ్రప్రదేశ్ హిందీ ప్రచార సభ ప్రచార కార్యదర్శి కోనే శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.