calender_icon.png 23 August, 2025 | 9:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు

23-08-2025 01:21:54 AM

లంచం తీసుకుంటూ పట్టుబడిన అదిలాబాద్, వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్‌లు

ఆదిలాబాద్, ఆగస్టు 22 ( విజయక్రాంతి)/ఎల్‌బీ నగర్: గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఏసీబీ అధికారులు తమకు వచ్చి న సమాచారం మేరకు దాడులు చేస్తున్నా అధికారుల తీరులో ఏమాత్రం మార్పు రావడంలేదు. ఇష్టానుసారంగా బాధితుల నుంచి లంచాలు డిమాండ్ చేస్తూ ఏసీబీ అధికారులకు దొరికిపోతున్నారు. శుక్రవారం తెలంగా ణ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు అదిలాబాద్, రంగారెడ్డి జిల్లా, రంగా రెడ్డి జిల్లాలోని వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో జాయింట్ సబ్ రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్, టైపిస్ట్ పట్టుబడ్డారు.వివరాలు.. అదిలాబాద్ జిల్లా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో  గిఫ్ట్ డీడ్ కోసం డబ్బులు డిమాం డ్ చేసిన జాయిట్ సబ్ రిజిస్టార్ శ్రీనివాస్ రెడ్డి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారుల రాకను గమనించిన  కొంత మంది కార్యాలయ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. బేల మండలం సిర్స న్న గ్రామానికి చెందిన మన్సుర్ ఖాన్ పటా న్ తన భార్య గౌసియ బేగం పేరున ఉన్న ఇంటిని తనపై గిఫ్ట్ డీడ్ కోసం ఈనెల ౨౦న జాయింట్ సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరెడ్డిని కలిశాడు.

రిజిస్ట్రేషన్ కోసం రూ. 5 వేలు ఇవ్వా లని సబ్ రిజిస్ట్రార్ డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. శుక్రవారం గిఫ్ట్ డీడ్ అయిన తరు వాత రూ. 5 వేలు ఇస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని, నిందితుడిని అరెస్ట్ చేసి కరీనంగర్ ఏసీబీ కోర్టుకు తరలించినట్లు  డీఎస్పీ మధు తెలిపారు.కాగా ఇన్ చార్జి బాధ్యతల్లో ఉన్న శ్రీనివాస్ రెడ్డి గతం లో కరీంనగర్ జిల్లా మంథని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడి బయటకు రావడం గమనా ర్హం.

అలాగే వనస్థలిపురంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో  స్థల రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రార్ డబ్బులు డిమాండ్ చేయడంతో తమ కు వచ్చిన సమాచారం మేరకు  రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో  సోదాలు నిర్వహించారు. వనస్థలి పురం సబ్ రిజిస్ట్రార్ రాజేశ్ ను అదుపులోకి తీసుకొని వివరాలు సేకరించారు. తుర్కయంజాల్‌లోని  200గజాల స్థలాన్ని రిజిస్ట్రే షన్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్ రాజేశ్ రూ, లక్ష డిమాండ్ చేశారు.

బాధితుడు అంత ఇవ్వలేనని రూ.70 వేలు ఇస్తానని ఒప్పుకొని, ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. లంచం తీసుకుంటుండగా రాజేశ్‌ను రెండెహ్యాండెడ్‌గా ప ట్టుకున్నారు. రాజేశ్‌తో పాటు టైపిస్ట్  రమేశ్ ను సైతం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.