calender_icon.png 27 November, 2025 | 9:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేరాలు నియంత్రణకు సహకరించాలి...

27-11-2025 07:51:06 PM

పోలీస్ అవగాహన సదస్సులో సీఐ ధనంజయ గౌడ్..

ఉప్పల్ (విజయక్రాంతి): నేరాలు నియంత్రణకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని నాచారం ఇన్స్పెక్టర్ ధనంజయ గౌడ్ అన్నారు. మల్లాపూర్ చాణిక్యపురి నగర్ కాలనీలో నాచారం పోలీస్ స్టేషన్ అడ్మిన్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య నేతృత్వంలో గురువారం నిర్వహించిన పోలీస్ అవగాహన సదస్సులో సిఐ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేరాలు నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు కాలనీవాసులకు వివరించారు. ప్రధానంగా నేరాల నియంత్రణకు తమ ఇంటి పరిసర ప్రాంతంలో సెంట్రల్ లాకింగ్ సిస్టం అమర్చుకోవడంతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.

అపరిచిత వ్యక్తులు నుండి చరవాణి కు వచ్చే కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బ్యాంకు లావాదేవీల సంబంధించిన ఎలాంటి ఓటిపిలు షేర్ చేయొద్దని ఆయన పేర్కొన్నారు.  బంగారం తస్కరించే ముఠాల పట్ల మహిళలు జాగ్రత్త వహించాలని బంగారు ఆభరణాలు ధరించి వెళ్లే ముందు అపరిచిత వ్యక్తులు అనుమానాస్పదంగా కనపడితే వెంటనే స్థానిక పోలీసులకు  సమాచార ఇవ్వాలని అని కోరారు. యువత మారకద్రవలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని మత్తుకు బానిసై బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని యువతకు సూచించారు. ఇంటి యజమానులు ఇళ్లను అద్దెకిచ్చేముందు అద్దెకు తీసుకున్న వాలి పూర్తి సమాచారం ఆధార్ కార్డులు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాచారం పోలీస్ స్టేషన్ సిబ్బంది కాలనీవాసులు పాల్గొన్నారు.