27-11-2025 09:16:55 PM
కొండాపూర్: కొండాపూర్ మండల సైదాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి అరుణ వంశీధర్ గౌడ్ గురువారం ఘనంగా నామినేషన్ దాఖలు చేశారు. పెద్ద ఎత్తున సన్నిహితులు, నాయకులు, కార్యకర్తల అరుణ వంశీధర్ గౌడ్ ర్యాలీతో మారేపల్లి కేంద్రానికి చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయంలో నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి చేతులకు అందజేశారు. గ్రామంలో వినిపించిన నినాదాలతో నామినేషన్ వేడుక సందడి వాతావరణాన్ని సంతరించుకుంది.
ఈ సందర్భంగా అరుణ వంశీధర్ గౌడ్ మాట్లాడుతూ సైదాపూర్ గ్రామ అభివృద్ధే నా లక్ష్యం, గ్రామ ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే సైదాపూర్ ను ఆభివృద్ధి దిశగా నడిపిస్తానుఅని పేర్కొన్నారు. గ్రామంలో ఏ సమస్య వచ్చిన తక్షణమే స్పందించి, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. సైదాపూర్ ప్రజలు తనకు ఆశీర్వాదం అందచేసి సర్పంచ్‌గా గెలిపించాలని కోరుతూ, గ్రామ అభివృద్ధికి తాను అంకితభావంతో పనిచేస్తానని అరుణ వంశీధర్ గౌడ్ పిలుపునిచ్చారు.