calender_icon.png 27 November, 2025 | 10:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైదాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా చింతకుంట రాధిక నామినేషన్ దాఖలు

27-11-2025 09:17:18 PM

గ్రామ అభివృద్ధి తమ దేయంగా ముందుకు వెళ్తామని హామీ..

కొండాపూర్: సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం సైదాపూర్ గ్రామానికి చెందిన చింతకుంట రాధిక భర్త రామా గౌడ్ స్థానిక సంస్థల ఎన్నికల భాగంగా గురువారం మారేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో తమ నామినేషన్ పత్రాన్ని మండల రిటర్నింగ్ అధికారి పండరి నాయక్‌ కు అందజేశారు. నామినేషన్ సందర్భంగా చింతకుంట రాధిక మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం తమ కుటుంబం ఎప్పుడూ ముందుంటుందని, ప్రజలు విశ్వసించి అవకాశం ఇస్తే సైదాపూర్ గ్రామం  నిలకడైన అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు.

ముఖ్యంగా తాగునీటి సమస్యలు, గ్రామంలో  రోడ్డు నిర్మాణాలు, డ్రైనేజ్ సౌకర్యాల మెరుగుదల, మహిళల కోసం స్వయం ఉపాధి అవకాశాలు, రైతులకు నీటి వనరుల పెంపు వంటి పలు ముఖ్య కార్యక్రమాలను అమలు చేసే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే గ్రామంలో యువత అభివృద్ధికి క్రీడా సౌకర్యాలు, లైబ్రరీ ఏర్పాటు, వృద్ధుల కోసం ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించడానికి ప్రయత్నిస్తామని రాధిక తెలిపారు. గ్రామ ప్రజల అభ్యర్థనలతో, అవసరాలతో ముందుకు వెళ్లే నాయకత్వం తమది అవుతుందని ఆమె స్పష్టం చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి  భర్త చింతకుంట రామ గౌడ్, మాజీ మార్కెట్ చైర్మన్ రాధాబాయి, మల్ల గౌడ్, పెద్దగొల్ల శంకరయ్య, గొల్ల కృష్ణయ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.