02-08-2025 04:33:08 PM
రోడ్డు నిబంధనలు పాటించాలి..
విద్యార్థులకు పోలీసుల అవగాహన..
సిద్దిపేట క్రైమ్: సిద్దిపేట జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు(One Town Inspector Vasudeva Rao), ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్(Traffic Inspector Praveen Kumar) కోరారు. శనివారం సిద్దిపేట బాలుర జూనియర్ కళాశాల విద్యార్థులకు డ్రగ్స్, గంజాయి ఇతర మత్తు పదార్థాలు, ట్రాఫిక్, రోడ్డు నిబంధనల గురించి ఎస్సైలు అవగాహన కల్పించారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, చదువుపై దృష్టి సారించాలని సూచించారు. మత్తు పదార్థాలు వాడటం వల్ల ఆరోగ్యం, కుటుంబం, సామాజిక జీవితం, ఆర్థిక పరిస్థితులపై దుష్ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.
ఎవరైనా మాదకద్రవ్యాలు తీసుకున్నట్లు తెలిస్తే "యాంటి డ్రగ్ సోల్జర్" యాప్ ద్వారా పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు. లేదా స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో(8712671111), టోల్ ఫ్రీ నెంబర్ 1908 కు ఫోన్ ద్వారా తెలియజేయాలని కోరారు. అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని, ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ, అధ్యాపకులు విజయభాస్కర్, ఫాతిమా, ట్రాఫిక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.