02-08-2025 07:20:08 PM
తుంగతుర్తి (విజయక్రాంతి): మూగజీవాలకు వర్షాకాలంలో నీలి నాలుక వ్యాధి రాకుండా టీకాలు వేయించుకోవాలని జిల్లా పశు వైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాస్ రావు(Animal Husbandry Department Officer Dr. Srinivas Rao) అన్నారు. శనివారం తుంగతుర్తి ప్రాంతీయ పశు వైద్యశాలను ఆకస్మికంగా ఆయన తనిఖీ చేసి టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఉచితంగా గొర్రె జవాలకు నీలి నాలిక వ్యాధి రాకుండా ఇచ్చే టీకాలను గొర్రెల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక పశు వైద్య సహాయక సంచాలకులు డాక్టర్ రవి ప్రసాద్. బుచ్చిబాబు, గణేష్, గొర్రెల కాపర్లు లింగయ్య, అవిలయ్య, నాగయ్య యాదయ్య తదితరుల పాల్గొన్నారు.