02-08-2025 07:35:25 PM
సదాశివపేట: పట్టణంలోని 17వ వార్డులో ఇందిరమ్మ గృహాలకు భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మునిపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు పేదింటి వారి సొంతింటి కలలను నెరవేర్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. లబ్ధిదారులయైన పోల రాధాబాయికి లబ్ధిదారుల పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు ప్రసన్న శంకర్ గౌడ్, గుండు రవి, కాంగ్రెస్ నాయకులు హాజీ, రఘు, వసీం, షజ్జి, తుకారం, మధు, యాదగిరి, జావిద్ తదితరులు పాల్గొన్నారు.