calender_icon.png 2 August, 2025 | 10:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంగనాయక సాగర్ పై నిషేధాజ్ఞలు

02-08-2025 07:32:53 PM

సిద్దిపేట క్రైమ్: రంగనాయక సాగర్ ప్రాజెక్టు(Ranganayaka Sagar Project)లో ఈత కొట్టడం, సెల్ఫీలు దిగడం నిషేధమని చిన్నకోడూర్ ఎస్ఐ సైఫ్ అలీ(SI Saif Ali) తెలిపారు. కట్టపై బైక్ రైడింగ్ కూడా నిషేధించినట్టు చెప్పారు. జలాశయంలో లోతైన గుంతలు, మొసళ్ళు ఉన్నాయని, సందర్శకులు నిషేధిత ప్రాంతంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. ప్రాజెక్టు చుట్టుపక్కల ప్రదేశాలలో పోలీస్ నిఘాను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఎవరైనా చట్ట వ్యతిరేకమైన పనులకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. రక్షణ చర్యల్లో భాగంగా శనివారం ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.