02-08-2025 07:38:48 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణం 24వ వార్డు అంబేద్కర్ రడగంబాల బస్తీలో మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలో తగిన వసతులు కల్పించాలని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో శనివారం ఆర్డిఓ హరికృష్ణ(RDO Harikrishna), మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్(Municipal Commissioner Tanniru Ramesh)కు వినతిపత్రం ఇచ్చారు. సరిపడా నిధులు మంజూరు చేసి విద్యార్థులకు తగిన వసతులను నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షుడు రామగిరి మహేష్, నాయకులు మచ్చ రాజేష్, చంద్రశేఖర్, ధర్మేందర్, రత్నం ఐలయ్య పాల్గొన్నారు.