calender_icon.png 2 August, 2025 | 7:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు చింతమడక విద్యార్థులు ఎంపిక

02-08-2025 04:29:53 PM

సిద్దిపేట రూరల్: హనుమకొండలో ఆగష్టు ముడు నాలుగు తేదీల్లో జరగబోయే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు చింతమాడక విద్యార్ధులు ఎంపికైనట్లు ఎంఈఓ కొత్తాపల్లి రాజిరెడ్డి(MEO Kothapalli Rajireddy) తెలిపారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాలో అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో జడ్పీహెచ్ చింతమడక విద్యార్థులు అండర్-14 బాలికల విభాగంలో పెద్దెల్లి గారి గీతిక ట్రయాథ్లాన్ లో బంగారు పతకం, జెల్ల అవంతిక వెండి పతకం, ట్రయాథ్లాన్-సీ బద్ద అర్చన వెండి పతకం, అండర్-14 బాలుర విభాగంలో గజ్జెల రేశ్వంత్ ట్రయాథ్లాన్-A బంగారు పతకం అండర్-14 వట్టిపల్లి వినీల్ రెడ్డి, జావాలియన్ త్రో వెండి పతకం సాధించారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డెరైక్టర్ వెంకట్వామి ఉపాధ్యాయలు బాలరాజు, అజిత్,సత్తయ్య, రాందాస్,రాంరెడ్డి, మనీషా కృష్ణవేణి రేణుకా, తరితరులు పాల్గొన్నారు.