01-05-2025 12:40:50 AM
ఆదిలాబాద్, ఏప్రిల్ 30 (విజయ క్రాంతి): కుల వివక్షతను రూపుమాపడం కోసం కృషి చేసిన మహానీయుడు మహాత్మ బసవేశ్వరుడని, ఆ మహనీయుని బాటలో ప్రతి ఒక్కరు నడవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. విశ్వ గురువు, సంఘ సంస్కర్త, మహాత్మ బసవేశ్వర మహారాజ్ 892వ జయంతి వేడుకల్లో వారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆదిలాబాద్‌లో బుధవారం అధికారికంగా నిర్వ హించిన కార్యక్రమంలో మహాత్మ బసవేశ్వరుని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహిం చి, పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ... దుర్భరమై న జీవితాలు గడుపుతున్న ప్రజల బతుకుల్లో వెలుగులు నింపేందుకు సమాజంలో వివక్షతను రూపుమాపేందుకు కృషి చేసిన మహా నీయుడు బసవేశ్వర అని అన్నారు.
ఆ మహనీయుని స్పూర్తితో సమాజంలో మార్పు కోసం ప్రతి పౌరుడు పాటుపడాలన్నారు. సమాజంలో అనేక మూఢాచారాలను పారద్రోలి, కుల రహిత సమాజ నిర్మాణం కోసం పాటుపడ్డారని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు, లింగాయత్ సమాజ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
బసవేశ్వర చరిత్ర భావితరాలకు అందించాలి
కుమ్రం భీం ఆసిఫాబాద్,ఏప్రిల్ 30(విజయక్రాంతి): హైందవ మతాన్ని సంస్కరిం చిన బసవేశ్వరుడి చరిత్ర భావితరాలకు అం దించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ బసవేశ్వర జయంతి వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్ తో కలిసి హాజరై బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించా రు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడు తూ దేశంలోని కర్ణాటక రాష్ట్రంలో బాగేవాడి గ్రామంలో జన్మించిన బసవేశ్వరుడు 12 వ శతాబ్దంలో హైందవ మతాన్ని సంస్కరించిన వారిలో ప్రముఖుడని తెలిపారు. సమాజం లో కుల వ్యవస్థ, వర్ణ విభేదాలు, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుద య వాది అని, లింగాయత ధర్మం స్థాపించి వచన సాహిత్యంతో కుల మతాలకు అతీతంగా సమాజాన్ని ఏకం చేశారని అన్నారు.
బసవేశ్వరుడు తన వచనాలను సులువుగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో బోధించేవారని, ఇలాంటి మహనీయుల చరిత్ర భావిత రాలకు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి సజీవన్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు అలిబిన్ అహ్మద్, వెనుకబడిన తరగతుల సంఘాల నాయకులు, అధికారు లు తదితరులు పాల్గొన్నారు.