08-09-2025 12:00:00 AM
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 7, (విజయక్రాంతి)గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిస్కారానికి కమ్యూనిస్టు కార్యకర్తలు కృషి చేయాలని, అవసరమైతే ప్రజలను సమీకరించి ఉద్యమాలు చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా కోరారు. సిపిఐ జిల్లా కార్యాలయం ’శేషగిరిభవన్’లో ఆదివారం జరిగిన సిపిఐ లక్ష్మీదేవిపల్లి మండల సమితి సమావేశానికి అయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.
గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల పరిస్కారంకోసం స్థానిక శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు నిరంతరం కృషి చేస్తున్నారని, మండలంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కా ర్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలని సూ చించారు.
వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, పోడు భూముల సమస్య, ఫారెస్టు అధికారుల దాడులు తదితర డిమాండ్ల పరిస్కారంకోసం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సమితి ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న కలెక్టర్ కార్యాలయం ముట్టడికి పార్టీలకతీతంగా జి ల్లా నలుమూలల నుంచి వ్యవసాయ కార్మికులు, పార్టీ, ప్రజాసంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.
9న కొత్తగూడెం క్లబ్బులో సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంటు సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో మండల నాయకులు దీటి లక్ష్మి పతి, కె రత్నకుమారి, మామిడాల ధనలక్ష్మి, నూనావత్ గోవిందు, కంటెం శ్రీని వాసరావు, శాపావత్ రవి, తదితరులు పాల్గొన్నారు.