10-01-2026 12:16:13 AM
వికారాబాద్, జనవరి- 9: సంక్రాంతి పండుగ సందర్భంగా ZPHS కుక్కింద పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్, kite ఫెస్టివల్, ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని కుక్కింద గ్రామ సర్పంచ్ పట్లోళ్ళ మానెమ్మ రాములు ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల వంటకాలను దారూర్ మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జిల్లా పీ ఆర్ టీ యు అధ్యక్షులు కడియాల చంద్రశేఖర్ తో కలిసి రుచి చూసి విద్యార్థులను అభినందించారు.
ఈ సందర్భంగా ఆమె పాఠశాలలో ఇలాంటి సాంప్రదాయ వంటకాల కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరణమైన విషయం అని తెలియజేశారు. ఎం ఈ ఓ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని విద్యార్థులను ప్రోత్సహించిన ఉపాధ్యాయులను అభినందించారు. అలాగే రాబోయే 10వ తరగతి పరీక్షలలో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచాలని 100% ఉత్తీర్ణత సాధించాలన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ గఫ్ఫార్ పాఠశాల AAPC చైర్మన్ పర్వీన్ పాఠశాల ఉపాధ్యాయులు రవీందర్ రెడ్డి, గుణవంత్ రెడ్డి, జగదీశ్వర్,శివప్రసాద్,సంతోష్ కుమార్,మల్లికార్జున, నర్సింలు, ఉదయ్ కుమార్, రవి, రాజశేఖర్, సుజాత, యాకాంతం, వెంకటేష్, మల్లప్ప విద్యార్థులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు