10-01-2026 12:16:20 AM
మంచిర్యాల, జనవరి 9 (విజయక్రాంతి) : జిల్లాలో 20 మందికి కారుణ్య నియామకాల క్రింద ఉద్యోగ నియామక పత్రాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో ఏవో రాజేశ్వర్ తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖలలో విధులు నిర్వహిస్తూ ఆకస్మాత్తుగా మరణించిన వారి కుటుంబ పోషణ నిమిత్తం ఆయా కుటుంబ సభ్యులలో ఒకరికి కారుణ్య నియామకం క్రింద ఉద్యోగ అవకాశం కల్పించడం జరుగుతుందని, ఈ క్రమంలో 20 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు.