10-01-2026 12:15:00 AM
ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్, జనవరి 9 : వనస్థలిపురంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఇతర ప్రాంతానికి తరలించొద్దని ప్రభుత్వాన్ని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం రెవెన్యూ శాఖ(రిజిస్ట్రేషన్ మరియు స్టాంపులు) ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంత్ ని సచివాలయంలో సుధీర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని వేరే చోటుకి తరలించొద్దని కోరారు.
ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండకూడదనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వనస్థలిపురం సబ్‌రిజిస్టర్ కార్యాలయం మునగ నూరులోని గ్రామ పంచాయతీ కార్యాలయానికి తరలించడానికి సన్నాహాలు జరుగుతు న్నట్లు తెలిపారు. నేపథ్యంలో ఎల్ బి నగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ప్రస్తుత వనస్థలిపురం సబ్ రిజిస్టర్ కార్యాలయం బిల్డింగ్ యజమాని తడకమల్ల విష్ణుమూర్తి గారితో కలిసి వెళ్లి ప్రభుత్వ కార్యదర్శి స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ రాజీవ్ గాంధీ హనుమంతు గారిని కలవడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ... వనస్థలిపురంలో ఉన్న సబ్ రిజిస్టర్ భవనాన్ని రూపాయి అద్దె లేకుండా దాదా పు 30 సంవత్సరాలు ఉచితంగా ఇవ్వడానికి బిల్డింగ్ యజమాని తడకమళ్ల విష్ణు మూర్తి ముందుకు వచ్చారని గుర్తు చేశారు. ప్రజా అవసరాలు దృష్టిలో పెట్టుకొని వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌ను వనస్థలిపురం లోనే కొనసాగించేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఉచితంగా భవనాన్ని ఇచ్చిన యజమానిని విష్ణుమూర్తిని ఎమ్మెల్యేతోపాటు రెవెన్యూ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు అభినందించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్ రెడ్డి, నాయకుడు మనోజ్ గౌరిశెట్టి తదితరులు పాల్గొన్నారు.