calender_icon.png 10 September, 2025 | 1:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసీ గూడల్లో కొమురం భీం విగ్రహాల ఏర్పాటు..

09-09-2025 07:13:19 PM

మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్...

బోథ్ (విజయక్రాంతి): సోనాల మండలంలోని ఆదివాసీ గూడ లైన మహదు గూడ, కేశవ్ గూడ, పార్డి (బి), పార్డి (కే), ఘన్పూర్, టివిటి, పరుపుల పల్లెలో తుల శ్రీనివాస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీం విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు మాజీ ఎంపీపీ, సొసైటీ చైర్మన్ తుల శ్రీనివాస్(Former MPP Tula Srinivas) వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం కొమురం భీం విగ్రహాల ఏర్పాటు కోసం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా తుల శ్రీనివాస్ మాట్లాడుతూ... కొమురం భీం ఆశయాలను ఆదివాసి గ్రామాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో కొమురం భీం విగ్రహాల ఏర్పాటుకు  సంకల్పించామన్నారు. కొమురం భీం ఒక వ్యక్తి కాదు శక్తి అని ఆయన ఎందరికో స్ఫూర్తి నిచ్చారని కొనియాయాడారు. ఈ కార్యక్రమంలో సోనాల మండలం పార్డి (బి) రాయి సెంటర్ సర్మేడీ తొడసం లక్ష్మణ్, ఐటిడిఎ మాజీ డైరెక్టర్ మెష్రం భూమన్న, సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.