09-09-2025 07:53:31 PM
చండూరు (విజయక్రాంతి): ప్రకృతిని గౌరవించుకొని, ప్రతి ఇల్లు మొక్కలతో కళకళలాడాలని, విద్యార్థి దశలో పర్యావరణ పరిరక్షణ పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలని చండూర్ ఆర్డీవో శ్రీదేవి(Chandur RDO Sridevi) పిలుపునిచ్చారు. చండూరు మున్సిపల్ కమిషనర్ మల్లేశం ఆధ్వర్యంలో చండూర్ హైస్కూల్లో జరిగిన పర్యావరణ సంరక్షణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు బహుమతులు అందజేశారు. రైజింగ్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా చండూరు మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిది పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన చిత్రలేఖన పోటీలు గతంలో నిర్వహించగా వాటిలో విజేతలైన వారికి బహుమతి ప్రదానం ఆర్డీవో శ్రీదేవి చేతుల మీదుగా అందచేశారు. తెలుగు ఉపాధ్యాయులు మద్దోజు సుధీర్ బాబు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో చండూరు మున్సిపల్ కమిషనర్ ఎల్. మల్లేశం, మండల విద్యాధికారి వి. సుధాకర్ రెడ్డి, చండూర్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఏ.కోటీశ్వర్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ జి. కరుణాకర్ రెడ్డి, చండూరు మున్సిపాలిటీ పరిధిలోని వివిధ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.