calender_icon.png 10 September, 2025 | 1:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత ఉపరాష్ట్రపతిగా సీ.పీ రాధాకృష్ణన్

09-09-2025 07:32:54 PM

న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి సీ.పీ రాధాకృష్ణన్(C.P. Radhakrishnan) ఎన్నికయ్యారు. భారత 17వ ఉపరాష్ట్రపతిగా సీ.పీ రాధాకృష్ణన్ ఘనవిజయం సాధించారు. మొత్తం 781 మంది సభ్యులలో 768 మంది పార్లమెంటు సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్డీఏ తరపున సీ.పీ రాధాకృష్ణన్, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థులుగా పోటీ చేశారు. ఉపరాష్ట్రపతి కోటాకు అవసరమైన ఓట్లు 377 కాగా, రాధాకృష్ణన్ 452 ఓట్లు.. సుదర్శన్ రెడ్డి 300 ఓట్లు పొందారు. మొత్తం పోలైన ఓట్లలో 15 చెల్లనివిగా తేలింది. దీనితో, రాధాకృష్ణన్ 152 ఓట్ల మెజారిటీతో గెలిచారని రాజ్యసభ కార్యదర్శి ప్రకటించారు. కొత్త పార్లమెంట్ భవనంలోని 'ఎఫ్-101 వసుధ'లో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 6 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.